జిన్నారం మండలం ఐడిఎ బొల్లారంలో మీనాక్షి రాడ్ పరిశ్రమలో పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో హేమంత్ అనే వ్యక్తి సజీవదహనం కాగా… మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. జిన్నారం మండల కేంద్రంలోని ఐడిఏ బొల్లారంలో ఇతర రాష్ట్రాల కెని కార్మికులను తీసుకువచ్చి పరిశ్రమ యాజమాన్యాలు వెట్టిచాకిరి చేయిస్తున్నాయి. కార్మికులకు ఎలాంటి సేఫ్టీ లేకుండా పరిశ్రమ యాజమాన్యం ఇష్టారాజ్యంగా హార్డ్ వర్క్ చేయిస్తున్నారు. రాడ్ పరిశ్రమలో భగభగమండే రాడ్స్ యంత్రాల ద్వారా బయటకు వస్తుంటే కార్మికులకు కనీస సౌకర్యాలు లేకుండా ఎలాంటి సేఫ్టీ లేకుండా యాజమాన్యాలు పరిశ్రమలు నడిపిస్తుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. పరిశ్రమలపై పరిశ్రమలకు సేఫ్టీ పరికరాలు ఉన్నాయా లేవా అనే కోణంలో దర్యాప్తు చేయని వైనం కనబడుతుంది మీనాక్షి పరిశ్రమలో. బిక్కు బిక్కు మంటూ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పరిశ్రమలపై కొరడా ఝులిపించాలని బొల్లారం కార్మికులు కోరుతున్నారు.
స్టీల్ పరిశ్రమలో పేలుడు : కార్మికుడు సజీవ దహనం.. మరో ముగ్గురి పరిస్థితి విషమం
Advertisement
తాజా వార్తలు
Advertisement