Wednesday, November 20, 2024

మీడియం రేంజ్‌ క్షిపణి.. ప్రయోగం విజయవంతం.. నేరుగా లక్ష్యాన్ని ధ్వంసం చేసిన క్షిపణి

న్యూఢిల్లి: భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే మీడియం రేంజ్‌ క్షిపణిని భారత్‌ ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్‌ తీరంలోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ (ఐటీఆర్‌) నుంచి దీనిని ప్రయోగించారు. ఆర్మీ వ్యవస్థకు చెందిన ఈ క్షిపణి నేరుగా లక్ష్యాన్ని ధంసం చేసిందని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఈ క్షిపణి పరీక్షను నిర్వ#హంచినట్లు చెప్పారు. అత్యంత వేగంతో కూడిన దీర్ఘ శ్రేణి ఏరియల్‌ లక్ష్యాన్ని ఇది నేరుగా ఢీకొట్టి ధ్వంసం చేసిందని వివరించారు. కాగా ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బ్ర#హ్మూస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని భారత్‌ బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఆ పరీక్షను అండమాన్‌ నికోబార్‌ దీవులలోని క్షిపణి శ్రేణిలో చేపట్టారు.

ఈ ప్రయోగంలో పాల్గొన్న వారందరికీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి అభినందనలు తెలిపారు. ఈనెల ప్రారంభంలో సుదూర లక్ష్యాలను ఛేదించే దీర్ఘ శ్రేణి బ్ర#హ్మూస్‌ వెర్షన్‌ను భారత నేవీ పరీక్షించింది. ఇది లక్ష్యాన్ని చాలా ఖచ్చితంగా ధ్వంసం చేసిందని నేవీ అధికారులు పేర్కొన్నారు. గతవారం పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ బ్రహ్మోస్‌ క్షిపణుల సరఫరా కోసం ఫిలిప్పీన్స్‌తో ఒప్పందం కుదుర్తున్నందుకు ప్రభుతాన్ని అభినందించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన సైనిక ఫ్లాట్‌ఫారమ్‌ల కోసం మరిన్ని ఎగుమతి ఆర్డర్‌లను పొందేందుకు ప్రయత్నాలను వేగవంతం చేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) 83 తేజస్‌ ఫైటర్‌ జెట్‌ల ఉత్పత్తికి ఆర్డర్‌లు పొందడంపై కూడా కమిటీ సంతోషం వ్యక్తంచేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement