హైదరాబాద్ – తీవ్ర భుజం నొప్పితో బాధపడుతున్న హరీశ్‌రావుకు ఏఐజీ దవాఖానాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. నిన్న పోలీసుల అరెస్ట్ చేసే సమయంలో ఆయన ఎడమ భుజానికి తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ ఏఐజీ దవాఖానలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే అంతకుముందు బీఆర్ఎస్ ఆందోళనల నేపథ్యంలో హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
దీంతో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. భుజం నొప్పిగా ఉన్నదని, దవాఖానకు వెళ్లాలని చెప్పినప్పటికీ అడ్డుకున్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత ఏఐజీకి వెళ్లేందుకును పర్మిషన్ ఇచ్చారు. అయితే హరీశ్‌రావుతోపాటు పోలీసులు కూడా దవాఖానకు వెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి పోలీస్ ఎస్కార్ట్ తో తన ఇంటికి తిరిగి వచ్చారు హరీశ్ రావు.
- Advertisement -