Friday, November 22, 2024

వరద ప్రాంతాల్లో విస్తృతంగా కొనసాగుతున్న వైద్య సేవలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వరద ప్రభావిత జిల్లాల్లో విస్తృతంగా ప్రజారోగ్య సంరక్షణా చర్యలు కొనసాగుతున్నాయని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ డా. జీ. శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 368 ఆరోగ్య క్యాంపులు నిర్వహించి18,558 మందికి వైద్య సేవలు అందించామన్నారు. మొత్తంగా ఈ నెల 16 నుంచి 64,230 మందికి వైద్య సేవలు అందించినట్లు వెల్లడించారు. 32 మందిని ప్రభుత్వ పెద్దాసుపత్రులకు రిఫర్‌ చేశామన్నారు. వరద బాధితులకు వైద్య సాయం కోసం నిరంతరపర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక వార్‌ రూంను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.

24 గంటలపాటు పనిచేసేలా 9030227324, 040-24651119 హెల్ప్‌ లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశామన్నారు. మెడికల్‌ క్యాంపుల్లో తగినన్ని మందులు అందుబాటులో ఉంచామన్నారు. 108 సర్వీసులు అందుబాటులో ఉంచడంతోపాటు కొవిడ్‌ టెస్టులు విస్తృతంగా చేస్తున్నట్లు వివరించారు. 670 మంది వైద్య సిబ్బందిని వరద ప్రాంతాలో మోహరించామని, 297 హైరిస్క్‌ ప్రాంతాలను గుర్తించి విస్తృతంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement