Thursday, November 21, 2024

యూట్యూబ్ చూసి వంటలు చెయ్యటం చూసా… ఏకంగా అబార్షన్ !!

మాములుగా యూట్యూబ్ చూసి వంటలు నేర్చుకుంటాము.. లేదా మనకు తెలియని కొన్ని విషయాలను కూడా చూసి నేర్చుకుంటాము. కానీ వీడు ఏకంగా వీడు యూట్యూబ్‌లో చూస్తూ అబార్షన్స్ చేసేస్తున్నాడు. యూట్యూబ్ చూసి అబార్షన్ చెయ్యటం ఏంటని అనుకుంటున్నారా… !! వరంగల్ రూరల్ జిల్లా చెంగారావు పేటకు చెందిన ఇంద్రారెడ్డి గత నెలలో హన్మకొండలోని ఏకశిలా పార్కు ఎదురుగా సిటీ హాస్పటిల్ పేరిట ఆస్పత్రిని ప్రారంభించారు. పిల్లలు వద్దనుకునే వారికి, ఇతర సమస్యలు ఉన్న మహిళలకు అబార్షన్లు చేసే వాడు. గ్రామంలోని ఆర్‌ఎంపీలు, పీఎంపీల ద్వారా బాధితులను గుర్తించి వారికి కమిషన్లు ఇచ్చి పేషెంట్లను తీసుకువచ్చేవాడు. ఇక నర్సింగ్‌లో శిక్షణ పొందిన వారిసహాయంతో యూట్యూబ్‌లో చూస్తూ అబార్షన్లు చేసే వాడు.

ఇంద్రారెడ్డి ట్రీట్‌మెంట్‌పై అనుమానం రావడంతో వైద్యశాఖ అధికారులకు కొంత మంది సమాచారం ఇచ్చారు. దీంతో రెవెన్యూ అధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆస్పత్రిపై దాడి చేశారు. ఆ సమయంలో మహారాష్ట్ర నుంచి వచ్చిన మహిళలకు ఇంద్రారెడ్డి అబార్షన్ చేస్తున్నాడు. అధికారులను చూసిన ఆస్పత్రి సిబ్బంది ఒక్కసారిగా గోడ దూకి పారిపోయారు. ఆపరేషన్ థియేటర్లో ఉన్న మహిళన బాత్రూమ్‌లో దాచారు. మహిళకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో హన్మకొండ జీఎంహెచ్‌కు తరలించారు. ఇంద్రారెడ్డి మూడేళ్ల క్రితం వరంగల్ రూరల్ జిల్లా నర్సాపేట్‌లోనూ ఓ ఆస్పత్రి ఏర్పాటు చేయగా అక్కడ ఇలాగే బుక్ అయ్యాడు. అప్పుడే ఇంద్రారెడ్డిని అరెస్ట్ చేసి అధికారులు ఆస్పత్రిని సీజ్ చేశారు. అయినా మళ్లీ ఇప్పుడు హన్మకొండలో మరో ఆస్పత్రి పెట్టి మరోసారి ఈ ఫేక్ డాక్టర్ దొరికిపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement