కరోనా కాటుకి మనుషులే కాదు మూగజీవాలు సైతం మరణిస్తున్నాయి. థర్డ్ వేవ్ ముప్పు తప్పదని వైద్యశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాగా కరోనా మహమ్మారి బారిన పడి పలు జంతువులు..పక్షులు మృత్యువాత పడుతున్నాయి. తమిళనాడులోని వండలూరు జూ లో కోరోనా కలకలం సృష్టిస్తోంది. వండలూరు జంతుప్రదర్శన శాలలో కరోనా సోకి ఇప్పటికే తొమ్మిది నిప్పుకోళ్లు మృతి చెందగా.. తాజాగా ఒక ఆడ సింహం మరణించింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ఈ దారుణం జరిగింది. కరోనా వైరస్ మిగిలినవాటిపై ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం (అక్టోబర్ 27న) ఐదు నిప్పుకోళ్లు మృతి చెందాయి. వీటి నమూనాలు పరీక్షల నిమిత్తం పంపించారు. ఇంతలో మరో రెండు నిప్పుకోళ్లు మరణించాయి.
ఇదే సమయంలో గతంలో కరోనా బారిన పడి కోలుకున్న 19 ఏళ్ల కవిత అనే ఆడ సింహం వృద్ధ్యాప సంబంధిత వ్యాధులతో మరణించిందని జూ అధికారులు చెప్పారు. వరసగా పక్షులు, జంవుతులు అనారోగ్యంతో మరణించడంతో ఈ భయం మరింత పెరిగింది. ఈ క్రమంలో అధికారులు ఇతర వన్య ప్రాణులు అనారోగ్యం బారిన పడకుండాముందు జాగ్రత్తలు చేపట్టారు. చెన్నైలోని వండలూర్ జంతుప్రదర్శనశాలగా ప్రసిద్ధి చెందిన అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్‌లో ఉష్ట్రపక్షులు ఆకస్మికంగా మరణించడంతో ఎన్‌క్లోజర్ల పర్యవేక్షణను జూ అధికారులు వేగవంతం చేశారు. వైద్య అధికారులు వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు.