Thursday, November 21, 2024

Medical – నీట్ కౌన్సెలింగ్ య‌థాత‌థం….ఎన్ ఎ టి కి సుప్రీంలో ఊర‌ట‌


సుప్రీం కోర్టులో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి మళ్లీ ఊరట లభించింది. నీట్‌ కౌన్సెలింగ్‌ను రద్దు చేయలేమని స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం.. నీట్‌ వ్యవహారంపై వివిధ రాష్ట్రాల హైకోర్టులో దాఖలైన పిటిషన్ల బదిలీ పిటిషన్‌పై సానుకూలంగా స్పందించింది. గురువారం నీట్‌-యూజీ 2024 పరీక్షలకు సంబంధించిన 14 పిటిషన్లపై జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇందులో 49 మంది విద్యార్థులు 10 పిటిషన్లను అలాగే ఎన్టీఏ నాలుగు పిటిషన్లు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా నీట్‌ అవకతవకలపై పలు హైకోర్టులలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే వాటన్నింటినీ సుప్రీం కోర్టుకు బదిలీ చేసేలా ఆదేశాలివ్వాలని ఎన్టీఏ కోరింది. దీనికి సుప్రీం బెంచ్‌ సానుకూలంగా స్పందించింది. ప్రతివాదులకు గురువారం నోటీసులు జారీ చేసింది. అలాగే.. కేసులకు సంబంధించి హైకోర్టులో జరిగే విచారణలపై స్టే విధించింది.

- Advertisement -


మరోవైపు వివిధ విద్యార్థులు ఎన్టీయే కౌన్సెలింగ్‌ రద్దు చేయాలని చేసిన విజ్ఞప్తికి సుప్రీం నిరాకరించింది. అయితే వాళ్లు వేసిన పిటిషన్‌పై విచారణకు మాత్రం అంగీకరించింది. ఈ క్రమంలో పిటిషన్లపై స్పందన తెలియజేయాలని కేంద్రానికి, ఎన్టీఏకు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై జులై 8న విచారణ జరపనుంది. అదే రోజు గతంలో నీట్‌ పై దాఖలైన పలు పిటిషన్ల విచారణ జరగాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement