దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆదివాసీ గిరిజన జాతరగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడారం జాతర పేరొందింది. ఈ జాతరకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కాగా, 2025 సంవత్సరానికి సంబంధించి మేడారం మినీ జాతర తేదీలను సమ్మక్క-సారలమ్మ పూజారులు ప్రకటించారు.
2025 ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు అర్చకులు మినీ జాతర నిర్వహిస్తారు. మినీ మేడారం జాతరలో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకరారు. గద్దెల వద్ద పూజారులు ప్రత్యేక పూజలు చేస్తారు.
ఇక నాలుగు రోజుల పాటు మేడారం పరిసరాలు కోలాహలంగా మారనున్నాయి. జంపన్న వాగులో స్నానాలాచరించి అమ్మవార్లని దర్శించుకుని బంగారాన్ని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. కాగా, మేడారం మహాజాతర రెండేళ్లకోసారి జరుగనున్న సంగతి తెలిసిందే.