మేడారం మహా జాతర విజయవంతమైందని, నాలుగు రోజుల్లో కోటి నలభై లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని మంత్రి సీతక్క తెలిపారు. మేడారం జాతర నేటితో ముగియడంతో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. తక్కువ సమయంలోనే జాతరకు ఏర్పాట్లు చేశామన్నారు.
అమ్మవార్ల వన ప్రవేశం కాసేపట్లో జరుగనుంది. వనప్రవేశం పూర్తయినా భక్తుల రద్దీ కొనసాగుతుందని చెప్పారు. రేపటి వరకు కూడా అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. 4వేల మంది పారిశుధ్య సిబ్బంది విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు. జాతరకు నిధులిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, క్యాబినెట్ మంత్రులకు, సహకరించిన భక్తులకు ధన్యవాదాలు తెలిపారు.