వచ్చే ఏడాది మేడారం కుంభమేళా – జాతర జరగనుంది.. లక్షలాదిగా తరలివచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే సౌకర్యాల పనులు ప్రారంభమయ్యాయి.. ఈ క్రమంలో దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ నేడు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనుల గురించి చర్చించారు.
ఈ కుంభమేళా కోసం మౌలిక సదుపాయాల కల్పన, యాత్రికుల కోసం షాపింగ్ కాంప్లెక్స్, విశ్రాంతి గదులు, తాగునీటి నిర్మాణాలు, మండపం వంటి శాశ్వత సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం నిధులు మంజూరు చేయాలని సిఎంను ఆమె కోరారు. శాశ్వత ప్రతిపాదికను నిర్మాణాలు చేపట్టాలని, వాటికోసం బడ్జెట్ లో భారీగా నిధులు మంజూరు చేయవాలని అభ్యర్ధించారు. కాగా, ఈ పనులు చేపట్టేందుకు బడ్జెట్ మంజూరు కోసం శాఖల వారీగా ప్రతిపాదనలతో రావాలని కొండా సురేఖను రేవంత్ రెడ్డిని ఆమె కోరారు.