Monday, November 18, 2024

ఇండో- నేపాల్‌ సిరీస్‌లోఏపీ క్రీడాకారుడికి పతకాలు.. అండర్‌14 సింగిల్స్‌ షటిల్‌ బ్యాడ్మింటన్‌లో గోల్డ్‌మెడల్

అమరావతి, ఆంధ్రప్రభ: ఏపీఎండీసీ ఫౌండేషన్‌ స్పాన్సర్‌ చేసిన షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పాంగి గౌతమ్‌ నేపాల్‌ లోని ఖాఠ్మండ్‌ లో జరిగిన యూత్‌ గేమ్స్‌ ఇండో-నేపాల్‌ ఇంటర్నేషనల్‌ సిరీస్‌ లో వేర్వేరు విభాగాల్లో బంగారు, వెండి పతకాలను సాధించాడు. ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు ఖాఠ్మండ్‌ లో జరిగిన పోటీ-ల్లో అండర్‌ 14 సింగిల్స్‌ పోటీ ల్లో గౌతమ్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. డబుల్స్‌ విభాగంలో వెండి పతకాన్ని సాధించాడు. ఈ సందర్భంగా తాను సాధించిన పతకాలతో మంగళవారం విజయవాడ ఎపిఎండిసి కార్యాలయంలో విసిఅండ్‌ఎండి విజి వెంకటరెడ్డిని కలిశారు.

ఈ సందర్బంగా గౌతమ్‌ను శ్రీ ఆయన అభినందించారు. మారుమూల గిరిజన ప్రాంతం నుంచి అంతర్జాతీయ వదికలపై క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులకు ఏపీఎండీసీ వెన్నంటి ప్రోత్సహిస్తుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ చక్కని ప్రతిభను చాటు కుని ఏజెన్సీ నుంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ గౌతమ్‌ పాల్గొనే క్రీడలకు ఎపి ఎండిసి ఫౌండేషన్‌ ద్వారా ప్రోత్సాహాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఎపిఎండిసి విసిఅండ్‌ ఎండిని కలిసిన వారిలో గౌతమ్‌ తండ్రి పాంగి భీమన్న, కోచ్‌ రాజబాబు ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement