ఎఫ్‌ఐహెచ్ ఉమెన్స్ హాకీ వరల్డ్ కప్ టోర్నీమెంట్‌లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచి, మెడల్ సాధిస్తామని ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం కెప్టెన్ సవిత ధీమా వ్యక్తం చేశారు. జులై 1 నుంచి స్పెయిన్, నెదర్లాండ్స్‌లో మెగా-ఈవెంట్ ప్రారంభం కాబోతున్నదని తెలిపారు. ఇటీవల జరిగిన ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్‌లో అద్భుతంగా రాణించామని, ఈ స్ఫూర్తితోనే వరల్డ్ కప్ టోర్నీకి సిద్ధమవుతున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఉమెన్స్ హాకీ జట్టు కెప్టెన్ సబిత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత హాకీ క్రీడాభిమానులకు బహిరంగ లేఖ రాశారు. జులై 3 నుంచి 7వ తేదీ మధ్యన భారత్ జట్టు రౌండ్-రాబిన్ లీగ్‌లో ఇంగ్లండ్, చైనా, న్యూజిలాండ్‌తో తలపడనుంది.
”జట్టులోని క్రీడాకారులంతా వరల్డ్ కప్ టోర్నమెంట్ కోసం ఎదురుచూస్తున్నాం… టోక్యో ఒలింపిక్స్ నుంచి భారత అభిమానుల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది… అమ్స్‌టెల్వీన్, నెదర్లాండ్స్, టెర్రాసా, స్పెయిన్‌లపై ఖచ్చితంగా గెలుపొంది మెడల్ సాధిస్తాం” అని సబిత లేఖలో పేర్కొన్నారు. వరల్డ్ కప్‌లో మెడల్ సాధించడమే ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం ధ్యేయం, కల అని సవిత పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన కనబరిచి నాల్గో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.