Thursday, December 26, 2024

Medak – ఏడుపాయల వనదుర్గమాతను ద‌ర్శించుకున్న రేవంత్

మెద‌క్ – ఏడుపాయల వనదుర్గమాత ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ద‌ర్శించుకున్నారు.. దుర్గమాతకు సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సీఎంకు వేదాశీర్వచనాలు అందించారు. ముఖ్య‌మంత్రి నేడు మెద‌క్ జిల్లాలో పర్య‌టిస్తున్నారు.. ముందుగా ఆయ‌న ఉదయం హైదరాబాద్ నుండి హెలికాప్టర్‎లో మెదక్ బయలుదేరిన నేరుగా కొల్చారం మండలం ఘనపూర్‎కు చేరుకున్నారు. అక్క‌డ హెలిపాడ్ వ‌ద్ద సీఎం కు కి కాంగ్రెస్ నాయకులు అధికారులు ఘన స్వాగతం పలికారు.స్వాగతం పలికిన వారిలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే, సంజీవరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.

అక్కడ నుండి సీఎం రేవంత్ రోడ్డు మార్గాన మెదక్‎లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమాత ఆలయానికి వెళ్లారు. అక్క‌డ కు చేరుకున్న రేవంత్ కి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఇక ద‌ర్శ‌నానంత‌రం ఆయ‌న క్రిస్మ‌స్ వేడుక‌ల‌లో పాల్గొనేందుకు మెద‌క్ చ‌ర్చికి బ‌య‌లు దేరి వెళ్లారు..

ఇక ఈ ప‌ర్య‌ట‌న‌లో సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహా, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement