Tuesday, November 26, 2024

నాన్ వెజ్ ప్రియులు అలర్ట్: మాంసం దుకాణాలు బంద్!

సండే వచ్చిందంటే చాలు ఎవరి ఇంట్లో అయినా స్పెషల్ ఉంటుంది. ఆదివారం హాలిడే కాబట్టి ప్రతీ ఇంట్లో చికెన్, మటన్, చేపలు ఇలా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. హైదరాబాద్ నగరంలో అయితే ఉదయం 6 గంటల నుంచే మాంసం దుకాణాల ఎదుట పెద్ద క్యూ లైన్ ఉంటుంది. పేదవారు, ధనవంతులు అనే తేడా లేకుండా అందరూ మాంసం అంటే ఇష్టాన్ని కనబరుస్తుంటారు. అయితే, ఈ ఆదివారం నగరంలోని నాన్ వెజ్ ప్రియులు మాంసానికి దూరంగా ఉండక తప్పదు.

మహవీర్ జయంతి సందర్బంగా ఆదివారం గ్రేటర్‌ పరిధిలోని కబేళాలు, చికెన్, మటన్, బీఫ్‌ దుకాణాలు బంద్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ ఆదేశించింది. ఈ నిబంధనలను అన్ని మాంసం దుకాణాదారులు పాటించేలా చర్యలు తీసుకోవాలని వెటర్నరీ విభాగం అధికారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. తిరిగి సోమవారం యథావిధిగా కబేళాలు తెరుచుకోవచ్చని కమిషనర్ వెల్లడించారు. దీంతో ఈ ఆదివారం నాన్ వెజ్ ప్రియులకు మాంసం దొరకదు. ఈ వార్త తెలుసుకున్న కొందరు శనివారంమే మాంసం దూకాణాలకు క్యూ కట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement