Saturday, November 23, 2024

టెంపుల్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి చర్యలు : ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్

టె-ంపుల్‌ టూరిజాన్ని ప్రోత్సహించడానికి చర్యలు చేపట్టనున్నట్లు- ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ తెలిపారు. శుక్రవారం బల్దియా కమీషనర్‌ ప్రావీణ్య, ఆర్‌.డి.ఓ.వాసు చంద్ర, కుడా అధికారులు, ప్రధాన అర్చకులతో కలిసి మాడ వీధుల నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యల గురించి భద్రకాళి ఆలయ ప్రాంతంలో క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు- చేసిన సమావేశంలో చీఫ్‌ విప్‌ మాట్లాడుతూ.. మాడ వీధుల నిర్మాణానికి సహకరించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, పార్లమెంటు సభ్యులు, నగరానికి చెందిన ప్రజా ప్రతినిధులందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్నారు. భక్తుల సౌకర్యార్థం మాడ వీధుల నిర్మాణానికి రూ.30 కోట్లు- రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని, భద్రకాళి ఆలయం పక్కన గల బయోడైవర్సిటీ పార్క్‌ ఏర్పాటు వల్ల ఎకో టూరిజం పెరిగిందన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ-ఆర్‌ సహకారంతో నగరంలో అన్ని హంగులతో ఆహ్లాదకరమైన పార్క్‌ ల ఏర్పాట్లతో సహా సుమారు రూ.50 కోట్ల వ్యయంతో భద్రకాళి బండ్‌ ను అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

పెద్ద ఎత్తున టె-ంపుల్‌ టూరిజం కాన్సెప్ట్‌లో భాగంగా నగరంలో అనేక చారిత్రాత్మక ప్రాంతాలు ఉన్నాయని, రెండు వేల సంవత్సరాల క్రితం వెలసిన జైన మతానికి చెందిన అగ్గలయ్య గుట్ట వంటి అనేక ప్రాంతాలు ఉన్నాయన్నారు. నగరంలో ఉన్నటు-వంటి ప్రకృతి సిద్ధ సహజమైన అందాలను అనుసంధానం చేయడం ద్వారా టూరిజాన్ని ప్రోత్సహించవచ్చు అన్నారు. నగరం హెల్త్‌, ఎడ్యుకేషన్‌, కల్చరల్‌ హబ్‌ గా తీర్చిదిద్దబడుతున్న ప్రస్తుత తరుణంలో టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడానికి సహకారం అందించడం జరుగుతుందన్నారు. రాబోయే కాలంలో -టె-ంపుల్‌ టూరిజం హబ్‌ అనే కనెక్టివిటీ తో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామని, బల్దియా, కుడా,రెవిన్యూ, పోలీస్‌తో సహా అన్ని విభాగాల అధికారులు సమన్వయం, వాస్తు ప్రకారం అర్చకుల అనుభవాలను పరిగణలోకి తీసుకుని పర్యాటక ప్రాంతంగా, ఆధ్యాత్మిక ప్రాంతంగా స్పిరిచ్చువల్‌ హబ్‌గా తీర్చిదిద్దే క్రమంలో ప్రజలు భక్తుల సహాయ సహకారాలతో పాటు- ఎన్‌.ఐ.టి.కళాశాల ప్రొఫెసర్ల చే సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకుంటామని చీఫ్‌ విప్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దేవరకొండ విజయలక్ష్మి సురేందర్‌,బొంగు అశోక్‌,దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమీషనర్‌ సునీత, ఆలయ ఈ. ఓ.శేషు భారతి,కుడా ఈ.ఈ.భీం రావ్‌,ప్రధాన అర్చకులు శేషు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement