Friday, November 22, 2024

బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు చర్యలు.. రష్యన్‌ ఫెడరేషన్‌ ద్వారా అవగాహనా ఒప్పందం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : నాణ్యమైన బొగ్గు లభ్యతను పెంచేందుకు కేంద్రం చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం ఉన్న 45మెట్రిక్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని 2029–30 నాటికి 140 మెట్రిక్‌ టన్నులకు పెంచేందుకు కోకింగ్‌ కోల్‌ మిషన్‌ను ప్రారంభించినట్లు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఉక్కు తయారీలో ఉపయోగించే కోకింగ్‌ బొగ్గుకు సంబంధించి సహకారం అందించేందుకు రష్యన్‌ ఫెడరేషన్‌ ద్వారా అవగాహనా ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. స్టీల్‌ క్లస్టర్‌ల కోసం ఫ్రేమ్‌ వర్స్‌ పాలసీని రూపొందించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త స్టీల్‌ క్లస్టర్‌కు అనుమతి లభించలేదని తెలిపింది. శంలో నాణ్యమైన కోకింగ్‌ బొగ్గు సరఫరా పరిమితంగా ఉండటం వల్ల అవసరమైన కోకింగ్‌ బొగ్గు డిమాండ్‌ను దేశీయంగా తీర్చడం సాధ్యం కావటం లేదని ప్రభుత్వం స్పష్టం చేసిందని కేంద్రమంత్రి చెప్పారు. దేశీయంగా ఉత్పత్తి చేయబడిన కోకింగ్‌ బొగ్గులో బూడిద కంటెంట్‌ అధికంగా ఉండటం వల్ల ఇది ఉక్కు తయారీకి ఉపయోగపడటం లేదన్నారు. దీనివల్ల 2019– 20లో 51.83మెట్రిక్‌ టన్నులను, 2020–21లో 51.20 మెట్రిక్‌ టన్నుల కోకింగ్‌ బొగ్గు దిగుమతైందని ఆయన పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement