నాటు నాటు సాంగ్ క్రేజ్ ఇంకా ఆగలేదు.. ఢిల్లీ చాందిని చౌక్ వద్ద ఈ పాటకి డ్యాన్స్ చేశారు జర్మనీ ఎంబసీ సిబ్బంది.. జర్మనీ ఎంబసీ ట్విట్టర్ లో ఈ వీడియో పోస్ట్ చేసింది. ఎంబసీలో ఉన్న జర్మనీ, ఇండియా సిబ్బంది కలసి ఈ డ్యాన్స్ వీడియో చేశారు. ఈ వీడియో చూస్తే ఇండియాలో వారు ఎంత బాగా కలసిపోయారో అర్థం అవుతోంది. అచ్చతెలుగు పాట భావం తెలియనప్పటికీ.. ఆ పాటలో బీట్ వారిలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది అని చెప్పడం లో సందేహం లేదు.
అంతకు ముందు నాటు నాటు సాంగ్ ట్రిబ్యూట్ గా సౌత్ కొరియా ఎంబసీ సిబ్బంది కూడా డ్యాన్స్ వీడియో చేశారు. వారి ఇన్సిపిరేషన్ తోనే తాము కూడా ఈ వీడియో చేసినట్లు జర్మనీ ఎంబసీ పేర్కొంది. జర్మన్స్ డ్యాన్స్ చేయలేరా నేను నా సిబ్బంది కలసి నాటు నాటు ఆస్కార్ విజయాన్ని ఇలా సెలెబ్రేట్ చేసుకున్నాం. ఒరిజినల్ సాంగ్ తో పోల్చితే మా డ్యాన్స్ చాలా బ్యాడ్ గా ఉంది. కానీ ఎంతో ఎంజాయ్ చేసాం. మమ్మల్ని ఇన్స్ పైర్ చేసిన కొరియన్ ఎంబసీకి థ్యాంక్స్. ఇండియాకి తిరిగొచ్చిన ఆర్ఆర్ఆర్ టీంకి స్వాగతం. నాటు నాటు పాటపై ఇప్పుడు ఎంబసీ ఛాలెంజ్ ఓపెన్ .. నెక్స్ట్ ఎవరు ? అంటూ జర్మనీ ఎంబసీ చీఫ్ ఫిలిప్ అకేర్మాన్ ట్వీట్ చేశారు.