Saturday, November 23, 2024

ఎంసీఏ రెండేళ్లే, ఏడాది తగ్గిస్తూ నిర్ణయం.. పలు కొత్త డిగ్రీలను ప్రకటించిన యూజీసీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ (ఎంసీఏ) కోర్సు వ్యవధిని రెండేళ్లకు తగ్గిస్తూ యూజీసీ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు గెజిట్‌లో తెలిపింది. ఎంసీఏ కోర్సు వ్యవధిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించినట్లు పేర్కొంది. అదేవిధంగా బాచిలర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థెరపీ (బీవోటీ) కోర్సును నాలుగేళ్ల నుంచి నాలుగున్నరేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ప్లస్‌ టు అర్హతతో బీ.ఎఫ్‌.టెక్‌, బీ.యూ.డీ (4 ఏళ్లు) డిగ్రీలను, యూజీ అర్హతతో ఎం.ఎఫ్‌.టెక్‌, ఎం.ఎఫ్‌.ఎం, ఎం.యూ.డీ (2 ఏళ్లు) కొత్త డిగ్రీలను ప్రకటించింది. నూతన స్పోర్ట్స్‌ డిగ్రీలను కూడా ప్రకటించింది. మూడేళ్ల కాల వ్యవధితో బాచిలర్‌ ఆఫ్‌ స్పోర్స్ట్‌ మేనేజ్‌మెంట్‌, బాచిలర్‌ ఆఫ్‌ స్పోర్స్ట్‌ సైన్స్‌ కోర్సులను, రెండేళ్ల వ్యవధితో మాస్టర్‌ ఆఫ్‌ స్పోర్స్ట్‌ మేనేజ్‌మెంట్‌, మాస్టర్‌ ఆఫ్‌ స్పోర్స్ట్‌ సైన్స్‌ డిగ్రీలను యూజీసీ ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement