షిరిడీ : షిరిడి మేయర్ అనితాతై జగ్తాప్, డిప్యూటీ మేయర్ విజయ్ జగ్తాప్ కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. షిరిడీలోని సమస్యలతోపాటు శ్రీ సాయిబాబా దర్శనం కోసం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. షిరిడీలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి గురించి చర్చించారు. నగరం మన్మాడ్ రోడ్డు అధ్వాన్నంగా ఉండడం, ప్రమాదాల సంఖ్యపై తీవ్రంగా చర్చించారు. మేయర్ చెప్పిన సమస్యల పరిష్కారానికి సీఎం షిండే సానుకూలంగా స్పందించారు. అనంతరం వారు షిరిడీని సందర్శించాలని షిండేను కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement