ఇటీవల ముగిసిన యూపీ ఎన్నికల్లో మాయావతి పోటీపడలేదని, కూటమి ఏర్పాటు చేయాలని సందేశం ఇచ్చినా, ఆమె ఏమాత్రం స్పందించలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. అయితే ఆ ఆఫర్‌కు మాయావతి ఏమాత్రం స్పందించలేదని చెప్పారు. కేంద్ర ఏజెన్సీల ఒత్తిడే అందుకు కారణం కావచ్చునని అన్నారు. ”ద దలిత్ ట్రూత్: ద బ్యాటిల్స్ ఫర్ లియలైజింగ్ అంబేద్కర్స్ విజన్” అనే పుస్తకావిష్కరణ కార్య క్రమంలో రాహుల్ తాజా వ్యాఖ్యలు చేశారు. రాహుల్ సన్నిహితుడు కె.రాజు ఈ పుస్తకాన్ని రచించగా, సమృద్ధ భారత్ పౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ఒక ఆయుధం.. అయితే రాజ్యాంగ సంస్థలకు స్వతంత్రత లేనప్పుడు ఆ ఆయుధం అర్ధంలేనిది. రాజ్యాంగ సంస్థలను ఆర్‌ఎస్‌ఎస్ స్వాధీనంలోకి తీసుకున్నది. సంస్థలను ప్రజలు నియంత్రించకపోతే దేశం కూడా నియంత్రించబడదు అని రాహుల్ పేర్కొన్నారు. ఇది కొత్త దాడి కాదు. మహాత్మాగాంధీని బుల్లెట్లతో చంపిన రోజునే ఈ ఇది మొదలైంది. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ప్రజలు ఆయుధాన్ని అందించారని, అయితే నేడు మీడియాను నియంత్రించడంతోపాటు రాజకీయనేతలను నియంత్రించేందుకు స్పైవేర్ ఉపయోగిస్తున్నం దున ఆ ఆయుధానికి అర్ధం లేకుండా పోతోందని చెప్పారు. తాను అవినీతికి పాల్పడివుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవాడిని కాదని, సీబీఐ, ఈడీ రాజకీయ వ్యవస్థను నియంత్రిస్తున్నాయని ఆరోపించారు.
రాజ్యాంగ సంస్థలను కాపాడుకోవాలి..
రాజ్యాంగం నిర్వీర్యమైనప్పుడు బలహీనులు ఎక్కువగా నష్టపోతారు. దళితులు, మైనారిటీలు, గిరిజనులు, నిరుద్యోగులు, చిన్న రైతులు, పేదలు తమ హక్కులను కోల్పోయే ప్రమాదం వాటిల్లుతుందన్నారు. అందుచేత రాజ్యాంగ సంస్థలను రక్షించుకోవాలని కోరారు. అంబేద్కర్, మహాత్మాగాంధీ చూపిన బాటలో పయనించి హక్కుల కోసం దళితులు పోరాడాలని పిలుపునిచ్చారు. అధికారం కోసం రాజకీయ నాయకులు ఆరాట పడుతుంటారు. జీవితం అంతా శ్రమిస్తారు. కానీ నేను అధికారం ఉన్న కుటుంబంలో పుట్టాను. అందుకే తనకు పదవులపై ఆసక్తిలేదు. దేశాన్ని అర్థం చేసుకోవాలన్న ఆసక్తి మాత్రం ఉందన్నారు. ”కొందరు రాజకీయవేత్తలు ఉన్నారు. మీరు చూసే ఉండొచ్చు. ఎన్నికల్లో మాయవతి ఏమాత్రం పోరాటం సాగించలేదు. పొత్తు పెట్టుకుం దాం, మీరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండండంటూ మేము సందేశం పంపాం. ఆమె స్పందించలేదు. కాన్షిరామ్ వంటి నేతలంటే మాకెంతో గౌరవం. యూపీలో దళితుల సాధికరత కోసం వారంతా అహారహం శ్రమించారు. కాంగ్రెస్ కూడా నష్టపోయింది. కానీ, మాయవతి వ్యవహారం మాత్రం ఇందుకు భిన్నం. నేను వారి కోసం పోరాడనని మాయవతి ఓపెన్‌గానే చెప్పేశారు. సీబీఐ, ఈడీ, పెగాసస్‌కు భయపడటం వల్లే ఆమె పోరాటం చేయలేదన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..