వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు మయాంక్ అగర్వాల్ ఎంపికయ్యాడు. టీమిండియా ఆటగాళ్లలో పలువురు కరోనా బారినపడటంతో సిరీస్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే బీసీసీఐ మాత్రం తాజగా మయాంక్ అగర్వాల్‌ను వన్డేలకు ఎంపిక చేయడం గమనార్హం. టీమిండియా ఓపెనింగ్ జోడీ శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్‌తోపాటు శ్రేయస్ అయ్యర్, స్టాండ్‌బై పేసర్ సైనీ తదితరులు కరోనా బారిన పడ్డారు. దీంతో వీరంతా వైద్యుల పర్యవేక్షణలో హోటల్‌లోనే ఐసోలేషన్‌లో గడుపుతున్నారు. విండీస్‌తో సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ అందుబాటులోకి రావడంతో ఓపెనర్‌గా బరిలో దిగనున్నాడు.
తాజాగా మయాంక్ ఎంపికవడంతో..రోహిత్-మయాంక్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం ఉంది. మయాంక్ అగర్వాల్ మూడురోజుల క్వారంటైన్ తర్వాత జట్టులో కలవనున్నాడు. మరోవైపు టీమిండియా క్రికెటర్లు నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. కాగా షెడ్యూల్ ప్రకారం ఈ నెల 6, 9, 11తేదీల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వన్డే సిరీస్ జరగనుంది. అనంతరం కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్ వేదికగా 16, 18, 20తేదీల్లో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగనుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..,