Saturday, November 23, 2024

Big Story: జల్‌శక్తిలో గరిష్ట పెట్టుబడులు.. 2024 నాటికి 210 బిలియన్‌ డాలర్లు

నీటి రంగంలో భారతదేశం గరిష్ట పెట్టుబడులతో ముందుందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ చెప్పారు. 2019 నుండి 2024 వరకు నీటి రంగంలో పెట్టుబడుల అంచనా 210 బిలియన్‌ డాలర్లుగా పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికమని వివరించారు. ఇషా లీడర్‌షిప్‌ అకాడమీ ప్లnాగ్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 11వ ఎడిషన్‌లో మూడవ రోజు మంత్రి ప్రసంగించారు. జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని వివరించారు. ఇది 2024 నాటికి గ్రామీణ భారతదేశంలోని అన్ని గృహాలకు సురక్షితమైన తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. నీటిని నిర్వ#హంచడం మా సమిష్టి బాధ్యత. ఈ దిశలో మనమందరం కలిసి పనిచేయాలి అని చెప్పారు.

జల్‌ జీవన్‌ మిషన్‌ డ్యాష్‌బోర్డ్‌ ప్రకారం, 2019లో 16 శాతం భారతీయ కుటుంబాలు కుళాయి నీటి కనెక్షన్‌కు ప్రాప్యత ఉంది. అది ఇప్పుడు 54 శాతానికి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నీటి నాణ్యతను నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ గ్రామీణ సమాజాన్ని నిమగ్నం చేస్తుంది. వినూత్న పరిష్కారాలను రూపొందించడానికి సాంకేతికతను ఉపయోగించుకుంటుంది. ప్రతి గ్రామంలో కనీసం 50శాతం మ#హళలు ఉన్న 21 మందితో కూడిన నీరు, పారిశుద్ధ్య కమిటీలను ఏర్పాటు చేయడం ప్రారంభించిందని షెకావత్‌ వివరించారు.

”మేము గ్రామాల్లోని మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాము. అన్ని ప్రాథమిక 12 పారామితులపై నాణ్యతను పరీక్షించడానికి వారికి చేతితో పట్టుకునే పరికరాలను అందించాము. వారు తమ గ్రామంలోని నీటిని తరచుగా కనీసం ఒక నెలలో లేదా ఒక వారం వ్యవధిలో పరీక్షించగలరు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, సెన్సార్‌ ఆధారిత పరిష్కారాలకు సహకారం అందించడానికి భారతీయ స్టార్ట్‌-అప్‌లను ఆహ్వానిస్తున్నామని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement