భారత్ వేదికగా అక్టోబర్ – నవంబర్ నెలలో జరుగనున్న వన్డే వరల్డ్ కప్‌ను విజయవంతంగా నిర్వహించేందకు ఐసీసీ పకడ్బందీ ప్రణాళికతో సిద్దం చేస్తోంది. మ్యాచ్‌లను వన్ సైడెడ్ పోరులా కాకుండా ఇరు జట్లకూ బ్యాట్, బంతి మధ్య ఆసక్తికర పోరు ఉండేలా చూడాలని, ఆ దిశగా పిచ్‌లను తయారుచేయాలని పిచ్ క్యూరేట్లరకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
మ్యాచ్‌లను రసవత్తరంగా మార్చాలంటే బౌండరీ లైన్ దూరాన్ని పెంచాలని, పిచ్ మీద పచ్చిక ఎక్కువ ఉండేలా చూసుకోవాలని దీంతో సీమర్లకు, స్పిన్నర్లకు సమానంగా పిచ్ సహకరించే విధంగా ఉండాలని తెలిపింది. అన్నింటికంటే ముఖ్యంగా అక్టోబర్ – నవంబర్ మాసాలలో మంచు మ్యాచ్‌ల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్టుగా పిచ్‌లను తయారుచేయాలని క్యూరేటర్లను ఆదేశించింది.