అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ 2023 మెగా టోర్నీ జరగనుంది. అందులో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా (నవంబర్ 5), సెమీ ఫైనల్‌తోపాటు ఐదు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ క్రమంలో టికెట్ల ధరలను బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) మంగళవారం ప్రకటించింది. టికెట్ల ధరలు రూ.650 నుంచి రూ.3000 వరకు ఉంటాయి. భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్, సెమీస్‌కు ఒకే రకమైన ధరలను నిర్ణయించగా, మిగతా మూడు మ్యాచ్‌లకు వేర్వేరు ధరలతో టికెట్లను విక్రయించనుంది.
ప్రస్తుతం ఈడెన్‌గార్డెన్స్ 63,500 మంది ప్రేక్షకుల సామర్థ్యాన్ని కలిగివుంది. భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్, సెమీస్ ధరలు: అప్పర్ టైర్ రూ. 900. డీ,హెచ్ బ్లాక్‌లు రూ.1,500. సీ, కే బ్లాక్‌లు రూ. 2,500. బీ, ఎల్ బ్లాక్‌లు రూ. 3,000గా నిర్ణయించారు. నెదర్లాండ్స్-బంగ్లాదేశ్ (అక్టోబర్ 28): టికెట్ ప్రారంభ ధర రూ. 650 (అప్పర్ టైర్స్). డి, హెచ్ బ్లాక్‌లు రూ. 1000. బీ, సీ, కే, ఎల్ బ్లాక్‌లు రూ. 1500గాను, బంగ్లాదేశ్ (అక్టోబర్ 31), ఇంగ్లాండ్‌తో (నవంబర్ 12) పాక్ మ్యాచ్‌లు: రూ. 800 (అప్పర్ టైర్). డీ, హెచ్ బ్లాక్‌లు రూ. 1,200. సీ, కే బ్లాక్‌లు రూ. 2000. బీ, ఎల్ బ్లాక్‌లు రూ. 2,200గా ఖరారు చేయబడ్డాయి.