ఇంటర్‌కాంటినెంటల్ కప్ విజయంతో భారత ఫుట్‌బాల్ జట్టు శాఫ్ ఛాంపియన్‌షిప్ 2023లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగబోతున్నది. బుధవారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో భారత్ పాకిస్థాన్‌తో తలపడనుంది. పీకింగ్ ఆర్డర్‌లో తక్కువ స్థాయిలో ఉన్న భారత జట్టుకు పాకిస్తాన్ నుంచి పెద్దగా సవాల్ ఎదురుకాకపోవచ్చు. అయితే బ్లూటైగర్స్ (భారత బృందం) మాత్రం తమ పోరాటాన్ని దూకుడుగా ప్రారంభించే ప్రయత్నం చేయవచ్చు.
తద్వారా ఇతర ప్రత్యర్థులకు బలమైన సందేశాన్ని ఇవ్వనున్నారు. ఎనిమిదిసార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత్ గ్రూప్-ఎలో నేపాల్, కువైట్, పాకిస్థాన్‌లతో కలిసి ఉంది. లెబనాన్, మాల్దివులు, భూటాన్, బంగ్లాదేశ్ జట్లు గ్రూప్-బి లో ఉన్నాయి. శాఫ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఛెత్రీ అదే పంథాలో కొనసాగాలని భారత జట్టు భావిస్తోంది. ఇక భారత కెప్టెన్ ఛెత్రి ఇప్పటి వరకు 137 మ్యాచ్‌లు ఆడి 87 గోల్స్ సాధించాడు. ఈ టోర్నీలో మరో మూడు గోల్స్ చేస్తే మలేసియా ఆటగాడు మొఖ్తార్ దహరి పేరిట ఉన్న (89గోల్స్) రికార్డును అధిగమిస్తాడు. ఆ వ్యక్తిగత మైలురాళ్లకు మించి, భారత్‌కు గర్వించదగిన జట్టు రికార్డు కూడా ఉంటుంది.
ఇప్పటి వరకు 8 టైటిళ్లు నెగ్గిన ఇండియా, ఇప్పుడు మరొక టైటిల్‌పై గురిపెట్టింది. భారత జట్టు గతంలో 1993, 1997, 1999, 2005, 2009, 2011, 2015, 2021లో టోర్నమెంట్‌ను గెలుచుకుంది. మాల్దిdవులు (2008, 2018), బంగ్లాదేశ్ (2003)లో విజేతలుగా నిలిచాయి. ”మేము మరింత మెరుగ్గా రాణించగలమని నాకు తెలుసు. కోచ్‌గా, నేను సంతృప్తిని ప్రదర్శించలేను. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. కానీ మేము పని చేయడం మానేయడం లేదు, మరింత మెరుగ్గా రాణిస్తాము. మరిన్ని విజయాల కోసం ప్రయత్నిస్తాము” అని ఇంటర్‌కాంటినెంటల్ కప్ విజయం తర్వాత భారత కోచ్ ఇగోర్ స్టిమాక్ చెప్పాడు.
భారత జట్టు:
గోల్ కీపర్లు: గురుప్రీత్ సింగ్ సంధు, అమ్రీందర్ సింగ్, ఫుర్బా లచెన్పా టెంపా.
డిఫెండర్లు: సుభాసిష్ బోస్, ప్రీతమ్ కోటల్, సందేశ్ జింగన్, అన్వర్ అలీ, ఆకాష్ మిశ్రా, మెహతాబ్ సింగ్, రాహుల్ భేకే.
మిడ్‌ఫీల్డర్లు: లిస్టన్ కొలాకో, ఆషిక్ కురునియన్, సురేష్ సింగ్ వాంగ్జామ్, రోహిత్ కుమార్, ఉదాంత సింగ్, అనిరుధ్ థాపా, నౌరెమ్ మహేష్ సింగ్, నిఖిల్ పూజారి, జీక్సన్ సింగ్, సహల్ అబ్దుల్ సమద్, లాలెంగ్‌మావియా రాల్టే, లాలియన్‌జువాలా చాంగ్టే, రౌలిన్ కుమార్ బోర్గెస్.
ఫార్వర్డ్స్: సునీల్ ఛెత్రి, రహీమ్ అలీ, ఇషాన్ పండిత.