టీ20 ప్రపంచకప్‌లో నేటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఫ్లోరిడాలో భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను టాస్ కూడా వేయకుండానే రద్దు చేయాల్సి వచ్చింది. ఉదయం నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ.. కాసేపటికే వర్షం ఆగడంతో కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా జరుగుతుందని అభిమానులు ఆశించారు. అయితే కొద్దిసేపటికే మళ్లీ వర్షం మొదలవడంతో మ్యాచ్ జరిగే అవకాశం లేదని అంపైర్లు తేల్చారు. దీంతో ఇరు జట్లకు ఒక పాయింట్ ఇచ్చి మ్యాచ్‌ను రద్దు చేశారు.
దీంతో తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడిన అమెరికా.. సూపర్ 8కి అర్హత సాధించింది. గ్రూప్ ఏ నుంచి సూపర్ 8 దశకు చేరిన రెండో జట్టుగా.. సూపర్ 8 దశకు అర్హత సాధించిన ఆరో జట్టుగా యూఎస్ఏ నిలిచింది. ఇప్పటికే భారత్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు సూపర్ 8కు అర్హత సాధించాయి. ఇక దీంతో 2024 టీ20 ప్రపంచకప్ నుంచి గ్రూప్ ఏలోని ఐర్లాండ్, పాకిస్థాన్, కెనడా నిష్క్రమించాయి.