మైలవరం, (ప్రభ న్యూస్) : కరోన నివారణకు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన ద్విచక్ర వాహనంపై సొంత ఖర్చులతో ప్రజలకు అవగాహన కలిగించేందుకు యాత్రగా బయలుదేరిన వైనమిది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరు’లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా హిందీ మాస్టారుగా పనిచేస్తున్న గొల్లమందల సురేష్ 2001 నుండి ఎయిడ్స్, సారా నిషేధం,పర్యావరణ పరిరక్షణ కొరకు మొక్కలు నాటడం వలన కలిగే ప్రయోజనాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 2019 కరోన మహమ్మారి విజృంభించి దేశంలో లక్డౌన్ విధించగా అప్పటిని నుండి అనేక చోట్ల తన ద్విచక్ర వాహనంకు మైకు అమర్చి, ప్లకార్డులు కట్టుకొని ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు.
అందులో భాగంగానే కల్లూరు నుండి విజయవాడకు అవగాహన యాత్రను ప్రారంభించి ఆదివారం మైలవరం చేరుకున్నారు.మైలవరం బస్సు స్టాండులో తన ద్విచక్ర వాహనాన్ని నిలిపి,చెట్లకు పోస్టర్లను తగిలించి మైకు ద్వారా కరోన వైరస్ పై ప్రజలకు నివారణ చర్యలు వివరించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రభ’తో ఆయన మాట్లాడుతూ ఒక పక్క హిందీ మాస్తారుగా విధులు నిర్వహిస్తూనే సెలవు రోజుల్లో ఎయిడ్స్, సారా వలన కలిగే అనర్ధాలపై, అదే విధంగా పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం వలన కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడైన,సేవా కార్యక్రమాలు జీవితానికి తృప్తినిస్తాయని అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital