Friday, November 22, 2024

భారీగా పెరిగిన కోవిడ్‌ కేసులు- 17వేల మైలురాయిని దాటిన పాజిటివ్ కేసులు

భారతదేశంలో రోజురోజుకు కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 17,336 కేసులు నమోదయ్యాయి. రోజువారీ కోవిడ్‌ సంఖ్య 120 రోజుల తర్వాత మొదటిసారిగా 17,000 మార్క్‌ను దాటింది. కోవిడ్‌తో తాజాగా 13మంది మరణించారు. కోవిడ్‌ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి మరణించినవారి సంఖ్య 5,24,954కి చేరుకుంది.


భారతదేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,200కి పైగా పెరిగి 88,284కి చేరుకుంది. మొత్తం కేసులలో 0.19 శాతానికి చేరుకుంది. గత 24 గంటల్లో 13,029 మంది కోవిడ్‌ నుండి కోలుకున్నారు, రికవరీ రేటు 98.60 శాతానికి చేరుకుంది.
గురువారం 13 లక్షలకు పైగా డోస్‌లు వేయగా, అందులో 3.77 లక్షలు బూస్టర్‌ డోస్‌లు వేశారు. గత 24 గంటల్లో 1, 2వ డోసులతో సహా 12 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల 3.23 లక్షల మంది పిల్లలకు టీకాలు వేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement