Friday, November 22, 2024

పుతిన్‌కు సొంత కుంపటి, రష్యా వ్యాప్తంగా నిరసనలు.. టీవీ చానెల్స్‌ సిబ్బంది రాజీనామాలు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు వ్యతిరేకంగా మాస్కోలో భారీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపేయాలంటూ రష్యన్‌ ప్రజలు రోడ్డుపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. రష్యా అధ్యక్ష భవనం వద్దకు చేరుకున్న వివిధ దేశాల ప్రజలు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేపట్టారు. తాము యుద్ధానికి వ్యతిరేకం అంటూ ప్రకటించారు. స్థానిక మీడియా ప్రతినిధులు కూడా పుతిన్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఓ రష్యన్‌ టీవీ ఛానెల్‌ స్టాఫ్‌ అంతా.. తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసింది.

నో టు వార్‌ పేరుతో తాము తమ ఉద్యోగాలను వదిలేస్తున్నామని ప్రకటించారు. టీవీ రెయిన్‌ (డోజోహ్డ్‌) సిబ్బంది పుతిన్‌కు వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధానికి సంబంధించిన ప్రసారాలు చేయలేమని చెప్పుకొచ్చారు. ఛానెల్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన నటాలియా సిండెయేవా మాట్లాడుతూ.. ఉద్యోగులు స్టూడియోల నుంచి వాకౌట్‌ చేశారన్నారు. చివరి టెలికాస్ట్‌ నో టు వార్‌ అన్నారు. నిరవధికంగా ప్రసారాలు నిలిపివేసినట్టు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement