ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. మంగళవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఈ కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి. చెందారు. .
ఆప్రాంతంలో ఇంకా పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడినట్లు సమాచారం. గాయపడ్డ జవాన్లకు ఆస్పత్రికి తరలించారు. కాంకేర్ లోక్‌సభ నియోజకవర్గానికి ఏప్రిల్ 26న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి.