గత 24 గంటల్లో దేశంలో 11 వేల 109 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇది 236 రోజులలో అత్యధికం. అయితే క్రియాశీల కేసులు 49,622కు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. 29 మంది మృత్యువాత పడటంతో మొత్తం మరణాల సంఖ్య 5,31,064కి చేరుకుంది. ఢిల్లి, రాజస్థాన్‌లో ముగ్గురు చొప్పున మరణించారు. ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లలో ఇద్దరేసి, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, ఉత్తరఖండ్, ఉత్తరప్రదేశ్‌లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
కేరళలో 9 మంది మరణించారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారి పాజిటివిటీ రేటు 5.01 శాతంగా నమోదైంది. వారం వారీ సానుకూలత రేటు 4.29 శాతంగా నిర్ణయించారు. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4,47,97,269, కాగా యాక్టివ్ కేసులు మొత్తం ఇన్ఫెక్షన్‌లలో 0.11 శాతంగా ఉన్నాయి.
జాతీయ రికవరీ రేటు98.70 శాతంగా నమోదైందని మంత్రిత్వశాఖ తెలిపింది. వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,42,16,586కి పెరిగింది. కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.66 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్‌లు అందించారు.