Thursday, November 21, 2024

Bihar: భారీ అగ్నిప్రమాదం… ఆరుగురు మృతి

భారీ అగ్నిప్ర‌మాదం జ‌ర‌గడంతో ఆరుగురు మృతిచెంద‌గా, మ‌రో 19మంది గాయ‌ప‌డిన ఘ‌ట‌న‌ బీహార్‌లో చోటుచేసుకుంది. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగానే ఈ మంటలు చెలరేగినట్లు సమాచారం అందుతోంది. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న పలువురిని రక్షించారు.

బీహార్ రాజధాని పాట్నాలోని రైల్వే జంక్షన్ ఎదురుగా ఉన్న పాల్ హోటల్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గురువారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. భవనం మొత్తం మంటలు, పొగతో చుట్టుముట్టింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటినా సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అగ్నిమాపక శాఖ డీఐజీ మృత్యుంజయ్ కుమార్ కూడా ఘటనా స్థలంలో ఉన్నారు. మంటలు దాదాపు అదుపులోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. హోటల్‌లోని గదుల్లో ఎవరైనా చిక్కుకుపోయారా అని సోదాలు చేస్తున్నారు. హోటల్ నుంచి దాదాపు 25 మందిని రక్షించినట్లు ఆయన తెలిపారు. 11 గంటల ప్రాంతంలో పాల్ హోటల్‌లో అగ్నిప్రమాదం గురించి సమాచారం వచ్చిందని, అగ్నిమాపక సిబ్బంది ఎంతో ధైర్యంతో మంటలను అదుపు చేశారని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement