Tuesday, November 19, 2024

వారణాశిలో భారీ అగ్నిప్రమాదం, నలుగురు సజీవదహనం..

పట్టు, చేనేత వస్త్రాలకు పెట్టిందిపేరైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాశిలోని గురువారం ఉదయం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో నలుగురు మరణించారు. వీరిలో ఇద్దరు బీహార్‌నుంచి వలస వచ్చిన కూలీలు. స్థానిక అసఫ్‌ నగరం కాలనీలోని ఒక చీరల తయారీ కేంద్రంలో కూలీలు వంట చేస్తుండగా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. పొగలు కమ్మేయడం, అగ్నికీలలు ఎగసిపడటంతో బయటకు వెళ్లలేక నలుగురు వ్యక్తులు రక్షించాలంటూ కేకలు వేశారు.

స్థానికులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. అగ్నికీలల్లో సజీవ దహనమైనారు. కాగా మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. ఈ ప్రమాదంలో తండ్రీ కొడుకులతోపాటు ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement