ఢాకా: బంగ్లాదేశ్‌లో ఘోరఅగ్నిప్రమాదం జరిగింది. చిట్టిగ్యాంగ్‌లోని సీతాకుందలోని కడమ్‌రాసూల్ ప్రాంతంలోని బీఎమ్ కంటైనర్ డిపోలో శనివారం రాత్రి 9గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అర్థరాత్రి సమయానికి ఆ మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈప్రమాదంలో ఇప్పటి వరకు 49 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 450 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. చిట్టిగ్యాంగ్ మెడికల్ కాలేజ్ పోలీస్ అవుట్‌పోస్ట్ ఆఫీసర్ న్యూరుల్ అలాం వివరాల ప్రకారం, కెమికల్ రియాక్షన్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వెల్లడించారు.
స్థానిక పోలీసుల కథనం ప్రకారం, ఈ ప్రైవేట్ కంటైనర్‌లో రాత్రి 9గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో, అర్థరాత్రి సమయానికి అది భారీ అగ్నిప్రమాదంగా మారి పూర్తిగా వ్యాపించింది. మంటలను అదుపు చేయడానికి 19 ఫైరింజన్లు పని చేశాయని, ఆరు అంబులెన్స్ లు అందుబాటులో ఉంచడం జరిగిందనిచిట్టిగ్యాంగ్ ఫైర్ సర్వీస్ మరియు సివిల్ డిఫెన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మహ్మద్ ఫరూక్ హోసన్ సిక్దర్ వెల్లడించారు. హెల్త్ అండ్ సర్వీస్ డిపార్టమెంట్ చీఫ్ ఇస్తాకుల్ ఇస్లామ్ మాట్లాడుతూ, ఈ అగ్నిప్రమాదంలో మరో 450 మంది తీవ్రంగా గాయపడ్డారని, దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.