Thursday, November 7, 2024

Follow up | నాసిక్‌ కెమికల్‌ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఒకరి మృతి, 14 మందికి తీవ్ర గాయాలు

నాసిక్‌ దగ్గరలోని మండేగాన్‌ పరిధిలోని కెమికల్‌ ఫ్యాక్టరీలో బాయిల్‌ పేలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో ఒకరు మృతిచెందగా, 14 మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయినట్లు స్థానిక కలెక్టర్‌, ఎస్‌పి తెలిపారు. ఈ ఫ్యాక్టరీ నాసిక్‌కు 30 కిమిల దూరంలో ఉంది. బాయిలర్‌ పేలుడు పెద్ద శబ్ధంతో పేలింది. చుట్టు పక్కల గ్రామాలకు భయంకర మైన శబ్ధం వినిపించింది. పేలుడుతో ఫ్యాక్టరీలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ పొగ చుట్టు ప్రక్కల గ్రామాలను వ్యాపించింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తోంది. నూతన సంవత్సరం మరియు ఆదివారం కావడంతో ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు తక్కువగా హాజరయ్యారు.

ఆటోమేటిక్‌గా పనిచేసే ఫ్యాక్టరీ కావడంతో సిబ్బంది చాలా తక్కువగా పనిచేస్తున్నారు. క్షతగాత్రులను దగ్గరలోని సుయాస్‌ హాస్పత్రిలో చేర్పించినట్లు రెవెన్యూ డివిజనల్‌ అధికారి రాధాకృష్ణ గేమ్‌ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు స్థానిక మంత్రి దాదాబుసే తెలిపారు. ఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి సందర్శిస్తారని మంత్రి తెలిపారు. పేలుడు జరిగిన ప్రదేశంలో ఎండు గడ్డి ఉండటంతో మంటలు అదుపులోనికి రావడం లేదని .. అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో మహిళ మృతిచెందగా.. గాయపడిన మిగతా వారిని ఆస్పత్రిలో చేర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement