Tuesday, November 26, 2024

కీయెవ్‌ సమీపంలోని చమురు డిపో పేల్చివేత.. వాసిల్‌కోవ్‌ వద్ద భారీ మంటలు

ఉక్రెయిన్‌లో రష్యన్‌ ఆర్మీ బీభత్సం సృష్టిస్తున్నది. తమకు అడ్డుగా ఉన్న ప్రతీదాన్ని నాశనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నది. ఆర్మీ స్థావరాలు, క్యాంపులు మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామన్న రష్యా.. ఇప్పుడు మాట తప్పింది. జనావాసాలు, చమురు డిపోలు, గ్యాస్‌ పైప్‌లైన్‌లు, సామాన్య ప్రజలు నివాసం ఉండే భవంతులు, పరిపాలనా భవనాలను లక్ష్యంగా చేసుకుంటున్నది. ఆదివారం కీయెవ్‌ సమీపంలో చమురు డిపోను రష్యన్‌ ఆర్మీ పేల్చేసింది. దీంతో భారీ ఎత్తున మంటలు చేలరేగాయి. ఉక్రెయిన్‌లోని కీయెవ్‌ నగరం సమీపంలోని వాసిల్‌కోవ్‌ వద్ద ఈ చమురు డిపో ఉంది. దీన్ని రష్యా సేనలు రాకెట్ల సాయంతో పేల్చేశాయి. దీంతో పెద్ద ఎత్తున చెలరేగిన మంటలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. ఈ పేలుడు కారణంగా విష వాయువులు వెలువడుతాయన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉక్రెయిన్‌ స్టేట్‌ సర్వీస్‌ ఆఫ్‌ స్పెషల్‌ కమ్యూనికేషన్‌ ఇన్ఫర్మేషన్‌ ప్రొటెక్షన్‌ సూచించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement