Friday, October 18, 2024

తజికిస్థాన్ లో భారీ భూకంపం

తజికిస్థాన్ లో భారీ భూకంపం సంభ‌వించింది. గురువారం తెల్లవారుజామున భూమి కంపించ‌డంతో ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఇండ్లలో నుంచి బయటకు పరుగుతు తీశారు. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.8గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. గోర్నో-బదక్షన్ ప్రాంతంలో భూమికి 20.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్‌జీఎస్‌ పేర్కొంది. ఆ తర్వాత 20 నిమిషాలకు 5.0 తీవ్రతతో అదే ప్రాంతంలో మరో భూకంపం వ‌చ్చింది. అయితే ఈ భూ ప్రకంపనల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement