తజికిస్థాన్ లో భారీ భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇండ్లలో నుంచి బయటకు పరుగుతు తీశారు. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.8గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. గోర్నో-బదక్షన్ ప్రాంతంలో భూమికి 20.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్జీఎస్ పేర్కొంది. ఆ తర్వాత 20 నిమిషాలకు 5.0 తీవ్రతతో అదే ప్రాంతంలో మరో భూకంపం వచ్చింది. అయితే ఈ భూ ప్రకంపనల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు.
Advertisement
తాజా వార్తలు
Advertisement