జపాన్‌లో మరో భారీ భూకంపం సంభవించింది. నైరుతి జపాన్‌లోని క్యుషు ప్రాంతంలో భారీ భూకంపం సంభవించినట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. జపాన్‌లో రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో భారీ భారీ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
దీంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఒక మీటరు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భూకంప కేంద్రం భూ ఉపరితలానికి దాదాపు 37 కిలోమీటర్ల దిగువన ఉన్నట్లు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.
- Advertisement -