Saturday, November 23, 2024

రాష్ట్రపతి ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్.. కాంగ్రెస్ సహా అనేక పక్షాలు ఓటేశారు : కే.లక్ష్మణ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు అనుకూలంగా దేశవ్యాప్తంగా భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ అన్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, ముర్ము గెలుపు చారిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. క్రాస్ ఓటింగ్ విషయంలో బీజేపీ ఎవరినీ ఒత్తిడి చేయలేదని, స్వచ్ఛందంగానే ఆమెకు అనుకూలంగా అనేక పార్టీల ప్రజా ప్రతినిధులు ఓటేశారని లక్ష్మణ్ అన్నారు. కాంగ్రెస్ సహా విపక్ష కూటమిలోని అనేక పార్టీల ప్రజా ప్రతినిధులు ద్రౌపది ముర్ముకు అనుకూలంగా ఓటేసినట్టు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటేశారని ఆయనన్నారు. బీజేపీ సామాజిక న్యాయం పాటించే పార్టీ ఆయన తెలిపారు. గిరిజన మహిళ రాష్ట్రపతి అవుతుండడం సంతోషంగా ఉందని అన్నారు. 

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement