ప్రపంచంలోని అత్యంత హింసాత్మక దేశాలలో దక్షిణాఫ్రికా ఒకటి. ఏటా ఇక్కడ 20వేల మంది హత్యకు గురైతుంటారు. అయితే ఆదివారం తెల్లవారుజామున దక్షిణాఫ్రికా టౌన్షిప్ సోవెటోలోని ఒక బార్ లో కూర్చున్న వ్యక్తులపై రైఫిళ్లు, పిస్టల్స్‌తో కొందరు కాల్పులు జరిపారు. దీంతో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు..
మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మారణహోమం శనివారం అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే జరిగింది. కాల్పులు జరిపిన వారు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ దాడిలో ఎంతమంది పాల్గొన్నారనేది స్పష్టంగా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.