Saturday, November 23, 2024

మాస్క్ పెట్టుకోని వారినుంచి 58 కోట్ల జరిమానా వసూలు..

కోవిడ్ నిబంధనలు పాటించకుండా మాస్క్ పెట్టుకొని వారి దగ్గర నుంచి వసూలు చేసిన రూపాయలు అక్షరాల యాభై ఎనిమిది కోట్లు. మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలో భారీ మొత్తంలో జ‌రిమానాలు వ‌సూల్ చేస్తున్నారు. మాస్క్ పెట్టుకోకుండా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో తిరుగుతున్న వారి నుంచి 58 కోట్ల జ‌రిమానా వ‌సూల్ చేసిన‌ట్లు బీఎంసీ పేర్కొన్న‌ది. జూన్ 23వ తేదీ వ‌ర‌కు ఆ మొత్తాన్ని వ‌సూల్ చేశారు. ముంబై సివిల్ పోలీసుల‌తో పాటు రైల్వే శాఖ ఆ మొత్తం అమౌంట్‌ను మాస్క్‌లేని వారి నుంచి వ‌సూల్ చేశారు. మ‌హారాష్ట్ర‌లో సెకండ్ వేవ్ స‌మ‌యంలో అత్య‌ధిక స్థాయిలో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. వైర‌స్ నియంత్ర‌ణ కోసం అక్క‌డ క‌ఠిన ఆంక్ష‌ల‌ను అమ‌లు చేశారు. మాస్క్ ధ‌రించాల‌న్న నియ‌మాన్ని ఉల్లంఘించిన వారిపై జ‌రిమానాలు వసూల్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement