Thursday, October 31, 2024

Paris Olympics | ఆ బాధ్యతలకు రాజీనామా చేసిన మేరీ కోమ్…

భారత దిగ్గజ బాక్సర్, మాజీ ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ కీలక నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో, భారత్ చెఫ్ డి మిషన్ (అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌లో జాతీయ జట్టుకు బాధ్యత వహించే వ్యక్తి) బాధ్యతల నుంచి తప్పుకుంది. పారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొనే భారత జట్టుకు మెంటార్‌గా సేవలందించేందుకు ఒలింపిక్ అసోసియేషన్ మేరీకోమ్‌ను చెఫ్ డి మిషన్‌గా నియమించింది. అయితే తాజాగా మేరీకోమ్ ఆ బాధ్యత నుంచి తప్పుకున్నారు.

వ్యక్తిగత కారణాలతో మేరీకోమ్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష ధృవీకరించారు. తనను చీఫ్ డి మిషన్ బాధ్యతల నుంచి తప్పించాలంటూ మేరీకోమ్ లేఖ రాశారని పీటీ ఉష వెల్లడించారు. ఈ నేపథ్యంలో మేరీకోమ్ రాజీనామాను ఆమోదించినట్లు ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష ప్రకటించారు. ఈ నేపథ్యంలో మేరీకోమ్ రాజీనామాను ఆమోదించినట్లు… త్వరలోనే ఆమె స్థానంలో కొత్త వ్యక్తిని నియమిస్తామని ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష ప్రకటించారు.

”దేశానికి సేవ చేసే ఏ అవకాశాన్నైనా నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తాను. ఈ బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వర్తించడానికి మానసికంగా సంసిద్ధమయ్యాను. కానీ నా వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. ఇలా చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ ఇంతకంటే నాకు వేరే మార్గం కనిపించడం లేదు. ఒలింపిక్స్‌లో నా దేశం తరఫున ఆడే అథ్లెట్లందరికీ ఎల్లవేళలా మద్దతుగా ఉంటాను” అని మేరీ కోమ్‌ పీటీ ఉషకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా మణిపూర్‌కు చెందిన మేరీ కోమ్‌.. ఆరుసార్లు వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచారు. 2021 లండన్‌ ఒలింపిక్స్‌లో ఈ లెజెండరీ బాక్సర్‌ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement