ప్రముఖ కార్ల కంపెనీ మారుతి సుజుకీ మొదటి త్రైమాసికంలో ఏకీకృత లాభం రెండింతలు పెరిగి, 1036 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ లాభం 475 కోట్లు. ఏప్రిల్-జూన్ మధ్య నికర అమ్మకాల విలువ 17,776 కోట్ల నుంచి 26,512 కోట్లకు పెరిగాయి.
గత సంవత్సరం ఇదే కాలంలో కోవిడ్ మూలంగా అమ్మకాలు పెద్దగా పెరగలేదని కంపెనీ తెలిపింది. జూన్ త్రౖౖౖెమాసికంలో మారుతి సుజుకీ 4,67,931 వాహనాలను విక్రయించింది. 69,437 వాహనాలను ఎగుమతి చేసినట్లు తెలిపింది. కంపెనీ వద్ద 2.80 లక్షల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా వీటిని వినియోగదారులకు అందించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రకటించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.