మారుతీ సుజుకీ సియాజ్ కారును మరింత మెరుగుపరిచి మార్కెట్లోకి విడుదల చేసింది. మార్కెట్లో ఇప్పటికే 3 లక్షల మంది సియాజ్ కస్టమర్లు ఉన్నారని కంపెనీ తెలిపింది. కొత్త వెర్షన్లో పలు ఆధునిక ఫీచర్లను జోడించినట్లు కంపెనీ తెలిపింది. డ్యూయల్ టోన్ కలర్స్‌లో ఇది లభ్యం కానుంది. కొత్త సియాజ్‌లో 20కిపైగా సెఫ్టీ ఫీచర్స్ ఉన్నాయని మారుతీ సుజుకీ తెలిపింది.
ఎలక్ట్రానిక్ స్టెబులిటీ ప్రోగ్రామ్(ఈఎస్పీ), హిల్ హోల్డ్ అసిస్ట్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, రేర్ పార్కింగ్ సెన్సర్స్, చై ల్డ్ సీట్ యాంకరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సియాజ్ 7 రంగుల్లో లభిస్తుంది. కొత్త సియాజ్ కారు 11,14,500 నుంచి 12,34,500 ధరల్లో లభిస్తుంది.