స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ సెగ్మెంట్‌లో అగ్రస్థానాన్ని పొందేందుకు మారుతీ సుజుకి ప్రయత్నాలను వేగవంతం చేసింది. తద్వారా దేశీయ ప్యాసింజర్ వాహనాలు మార్కెట్‌లో 50శాతం వాటాను తిరిగి పొందాలని చూస్తోంది. ఈ ప్రయత్నంలో గురువారం జిమ్నీ, ఫ్రాంక్స్ పేరుతో రెండు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. జిమ్నీని కంపెనీ గురుగ్రామ్ ప్లాంట్‌లో తయారు చేయనున్నట్లు టేకుచి తెలిపారు. ఐదు డోర్ల మోడల్‌ను తయారు చేస్తున్న ఏకైక దేశంగా భారత్ నిలుస్తుంది. ఆల్ టెర్రెయిన్, దృఢమైన, కాంపాక్ట్ లైఫ్‌స్టైల్‌తో జిమ్నీ మరింత సౌకర్యవంతంగా ఉంటుందని టేకుచి చెప్పారు. ఇది ఇక్కడి నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేయబడుతుంది.
సుజుకి ప్రపంచవ్యాప్తంగా 199 దేశాలు, ప్రాంతాలలో 3.2 మిలియన్ యూనిట్ల కంటే ఎక్కువ యూనిట్లు అమ్ముడైనట్లు సంస్థ తెలిపింది. జిమ్నీ, ఫ్రాంక్స్ రెండింటికీ బుకింగ్‌లు గురువారం ప్రారంభమయ్యాయి. డెలివరీలు ఈ వసంతకాలంలో” ప్రారంభమవుతాయని టేకుచి చెప్పారు. సెమీకండక్టర్ కొరత సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కంపెనీ తన మోడళ్ల సరఫరాను, ప్రత్యేకించి పెద్ద పెండింగ్ ఆర్డర్‌లను కలిగి ఉన్న ఎస్‌యూవీలను ప్రస్తుత త్రైమాసికంలో మెరుగవుతుందని ఆశిస్తున్నాం అని ఆటో ఎక్స్‌పో 2023లో ఉత్పత్తులను ఆవిష్కరించిన సందర్భంగా మారుతీ సుజుకి ఇండియా ఎండి, సిఇఒ హిసాషి టేకుచి చెప్పారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో మారుతీ సుజుకి ఎస్‌యూవీ విభాగంలో నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. 2023-24లో కనీసంగా 45 శాతం వాటాను చేరుకోవడం లక్ష్యమని చెప్పారు. మారుతీ సుజుకి తన మానేసర్ ప్లాంట్‌లో సంవత్సరానికి 1లక్ష యూనిట్లను జోడించడం ద్వారా దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా పెంచుకుందని, సుజుకి మోటార్ గుజరాత్ ప్లాంట్ కూడా గరిష్ట స్థాయికి చేరుకుందని టేకుచి అన్నారు.