మన దేశంలో కార్ల విక్రయాల్లో అగ్రస్థానంలో ఉన్న మారుతీ సుజుకీ సెఫ్టీ విషయంలో చాలా వెనుకబడి ఉంది. గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో మారుతీకి చెందిన పాపులర్ మోడల్స్ విఫలమయ్యాయ. మారుతీ సుజుకీకి చెందిన వ్యాగనార్, ఆల్టో కే 10 మోడల్స్‌లో క్రాష్ టెస్ట్‌లో పిల్లల రక్షణ విషయంలో జీరో మార్కులు పొందాయి. ఈ రెండు మోడల్స్ ఇండియా భద్రతా ప్రమాణాలను మాత్రం అందుకున్నాయి. గ్లోబల్ ఎన్‌క్యాప్ సెఫ్టీ రేటింగ్స్ ప్రకారం పెద్దల భద్రత విషయంలో వ్యాగనార్‌కు 1 స్టార్, ఆల్టోకే 10కు 2 స్టార్లు మాత్రమే వచ్చాయి. దీనిపై మారుతీ సుజుకీ ప్రతినిధి స్పందించారు.
తమ కార్లు అన్ని కూడా భారత ప్రభుత్వం నిర్ధేశించిన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని, వీటిని పరీక్షించి సర్టిఫికెట్లు కూడా ఇచ్చారని తెలిపారు. భారత్ నిర్ధేశించిన ప్రమాణాలు, యూరోప్ ప్రమాణాలు ఒకే మాదిరిగా ఉన్నాయని చెప్పారు. వోక్సోవ్యాగన్‌కు చెందిన వర్చుస్, స్కోడా స్లావియా కారు మోడల్స్ సెఫ్టీలో మొత్తం 5 స్థార్స్ సాధించాయి. ఇండియాలోనే తయారవుతున్న వోక్సోవ్యాగన్ కార్లు గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో పూర్తిగా సక్సెస్ అయ్యాయని కంపెనీ తెలిపింది. పెద్దల సీటు విషయంలో ఈ మోడల్స్ 34 పాయిం ట్లలో 29.71 స్కోర్ సాధించి 5 స్టార్ రేటింగ్ పొందాయి. పిల్లల రక్షణ విషయంలో 49 పాయింట్లకు 42 స్కోర్ సాధించాయి.