Friday, November 22, 2024

ప్రీమియం సిగ్మెంట్‌లోకి మారుతి సుజుకీ.. 20 లక్షల కారు లాంచింగ్‌కు రెడీ

మారుతీ సుజుకీ ఖరీదైన ప్రీమియం కార్ల సిగ్మెంట్‌లోకి ప్రవేశంచనుంది. త్వరలోనే కంపెనీ ఇన్విక్టో పేరుతో ఖరీదైన కారును మార్కెట్‌లోకి ప్రవేశపెడుతున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రీమియం కారు సిగ్మెంట్‌లో మారుతీ సుజుకీ తగిన మార్కెట్‌ వాటా సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇన్విక్టో కానును జులై 5న మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. ఈ కారు బుకింగ్స్‌ జూన్‌ 19 నుంచి ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవా తెలిపారు. టొయోటా ఇన్నోవా హైక్రాస్‌ కారు క్రాస్‌ బ్యాడ్జ్‌ వెర్షన్‌గా ఇన్విక్టో వస్తుందని ఆయన తెలిపారు.

ఇన్విక్టా అనే లాటిన్‌ పదం నుంచి ఈ పేరును ఎంపిక చేసినట్లు తెలిపారు. ఇన్విక్టో అంటే అజేయమైనదని అర్ధమని చెప్పారు. 20 లక్షలకు పైగా ఖరీదైన కార్ల మార్కెట్లోకి ప్రవేశించడం మారుతీ సుజుకీకి ఇదే మొదటిసారి. సామాన్యుల నుంచి లగ్జరీ కోరుకునే కస్టమర్ల వరకు అందరి అవసరాలకు అనుగుణమైన కార్లను కంపెనీ మార్కెట్లోకి తీసుకు వస్తుందని ఆయన చెప్పారు. కార్ల మార్కెట్లో లీడర్‌గా ఉన్న మారుతీ సుజుకీ 10 లక్షల లోపు ఖరీదైన కార్ల మార్కెట్‌లోనూ, 10 నుంచి 15 లక్షల వరకు ఉన్న మార్కెట్‌లోనూ మారుతీనే లీడర్‌గా ఉంది.

- Advertisement -

10 లక్షల లోపు ఖరీదైన కార్ల మార్కెట్‌లో మారుతీ సుజుకీకి 60 శాతం మార్కెట్‌ వాటా ఉంది. 10-15 లక్షల ఖరీదైన కార్ల సిగ్మెంట్‌లో మారుతీ సుజుకీకి 25 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉంది. 20 లక్షలకు పైగా ఖరీదైన కారును ప్రవేశపెట్టడంతో కొత్త కస్టమర్లను పొందడంతో పాటు, ఈ సిగ్మెంట్‌లోనూ కంపెనీ మంచి మార్కెట్‌ వాటా పొందాలని ప్రయత్నిస్తుందని శ్రీవాస్తవా తెలిపారు. మారుతీ సుజుకీ, టయోటా కంపెనీ మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ఈ కారును టయోటాకు చెందిన బిడాడీ యూనిట్‌లోనే తయారు కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement