న్యూఢిల్లి : సెమీ కండక్టర్ల కొరత దేశీయ కార్ల సంస్థల మళ్లి వేధిస్తూనే ఉంది. దీంతో ప్రముఖ కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచేందుకు నిర్ణయిస్తున్నాయి. ఇప్పటికే కియా తన కార్ల ధరలను భారీగా పెంచేసింది. కియా బాటలోనే మారుతీ సుజుకీ కూడా నడుస్తున్నది. ఈ నెల్లోనే కార్ల కొత్త ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. జనవరి 2021 నుంచి మార్చి 2022 మధ్య పలు దఫాల్లో మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంచింది.
ఈ మధ్య కాలంలో ధరలు 8.8 శాతం మేరకు పెరిగాయి. నిర్వహణతో పాటు ముడి సరుకుల వ్యయాలు పెరిగిన కారణంగానే.. కార్ల ధరలు కూడా పెంచేందుకు నిర్ణయించినట్టు వివరించారు. అయితే ఏ కారుపై ఎంత పెంచుతున్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..