దేశంలో అగ్రగామి కార్ల ఉత్పత్తి సంస్థ మారుతి సుజుకీ 9,125 కార్లను రీకాల్ చేసింది. ఈ సంవత్సరం నవంబర్ 2 నుంచి 28 వరకు తయారైన కార్లను వెనక్కి పిలిపిస్తున్నుట్లు మారుతి సుజుకీ తెలిపింది. ముందు వరస సీట్ల ఎత్తు సవరించడం, ఫ్రంట్ సీట్ బెల్డ్‌లో గుర్తించిన లోపాలను సరిచేయాల్సి ఉందని కంపెనీ తెలిపింది. అలాగే ఉంటే సీటు బెల్టు విడిపోయే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. ఇలా వెనక్కి పిలుస్తున్న మోడల్స్‌లో సియాజ్ బ్రెజా, ఎర్టిగా, ఎక్స్ ఎల్6, గ్రాండ్ విటారా ఉన్నాయి. గ్రాండ్ విటారా పూర్తిగా కొత్త మోడల్, కేజ్ తప్ప మిగిలిన అన్ని పాత మోడల్ కార్లను అప్‌గ్రేడ్ చేసి తాజాగా కొత్త వాహనాలను మార్కెట్లో ఇటీవలే కంపెనీ విడుదల చేసింది.
సీటు బెల్ట్ ఏర్పాటులో చిన్న లోపాన్ని గుర్తించినట్లు కంపెనీ తెలిపింది. దీన్ని సవరిస్తామని పేర్కొంది. కంపెనీ తెలిపిన తేదీల్లో ఈ కార్లను కొనుగోలు చేసిన కస్టమర్లకు సమాచారం ఇస్తున్నామని తెలిపింది. కంపెనీ అధీకృత వర్క్‌షాప్‌లో వీటిని సరిచేయించుకోవాలని కంపెనీ కోరింది. వీటిని ఉచితంగానే కంపెనీ రీప్లేస్ చేస్తుందని తెలిపింది. కార్లలో లోపాలు సరి చేసేందుకు మారుతి సుజుకీ ఈ సంవత్సరంలో ఇలా రీకాల్ చేయడం ఇది నాలుగోసారి. కంపెనీ ఏప్రిల్‌లో 29,731 ఇకో వ్యాన్లను వెనక్కి పిలిచింది. 2021 జులై నుంచి అక్టోబర్ మధ్యలో తయారైన వాహనాల్లో వీల్ రిమ్ సైజ్‌లో తేడాలు గుర్తించడంతో కంపెనీ వాటిని వెనక్కి పిలిపించి సరి చేసింది. ఈ సంవత్సరం ఆగస్టులో 166 డిజైర్ టూర్ కార్లను రీకాల్ చేసింది. వీటిలోఎయిర్ బ్యాగ్ కంట్రోలింగ్ యూనిట్లో లోపాలను గుర్తించారు. సెప్టెంబర్‌లో కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఏకైక కమర్షియల్ వాహనం సూపర్ క్యారీ లోకొన్ని లోపాలను గుర్తించిన కంపెనీ 5,002 వాహనాలను రీకాల్ చేసింది.